Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్రాయికల్ మండలంలో అభివృద్ధి పనులు

రాయికల్ మండలంలో అభివృద్ధి పనులు

- Advertisement -

-లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – రాయికల్

మండలంలోని వీరాపూర్,ఒడ్డెర కాలనీలో 12 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాయికల్ పట్టణ గుడేటి రెడ్డి సంఘంలో జరిగిన కార్యక్రమంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంసహాయనిధి కింద రూ.12 లక్షల చెక్కులు,56 మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.56.06 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ‌…పిల్లల సౌకర్యార్థం అంగన్వాడి భవనాలు,సాగునీటికి చెక్‌డ్యామ్‌లు, రహదారి నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల జిల్లాకు మంజూరయ్యాయని, ప్రతి గ్రామానికి కోటి రూపాయల కంటే ఎక్కువ నిధులు కేటాయించబడ్డాయని అన్నారు. అన్ని కుల సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.ఈ నెల 19వ తేదీన రాయికల్ గుడేటి రెడ్డి సంఘంలో క్యాన్సర్ వ్యాధి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad