Thursday, September 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ పాఠశాలకు వెళ్తూ డ్రైనేజీలో పడిపోయిన ఆరేండ్ల బాలిక..వీడియో

 పాఠశాలకు వెళ్తూ డ్రైనేజీలో పడిపోయిన ఆరేండ్ల బాలిక..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని యాకుత్‌పురాలో ఓ చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మ్యాన్‌ హోల్‌ తెరచి ఉండటంతో ఆరేండ్ల బాలిక అందులో పడిపోయింది. గమనించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు తీశారు.

ఆరేండ్ల బాలిక తన తల్లి, సోదరితో కలిసి స్కూల్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో వారిద్దరి కంటే ముందు నడుస్తున్న ఆ చిన్నారి.. రోడ్డుపై తెరచి ఉన్న మ్యాన్‌ హోల్‌ను గమనించలేదు. దీంతో ప్రమాద వశాత్తు అందులో పడిపోయింది. అయితే వెనకే వస్తున్న ఆమె తల్లి గమనించి వెంటనే బయటకు తీసింది. దీంతో ఆ చిన్నారని ప్రాణాలతో బయటపడింది. అయితే మూత తెరిచి ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -