Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధి వంచితులకు సపర్యసేవలు 

విధి వంచితులకు సపర్యసేవలు 

- Advertisement -

మానవత్వంచాటిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

గత కోన్ని రోజులుగా అనారొగ్యంతో మతిస్థిమితం కోల్పోయి మల మూత్రలు ఒంటికి పిడుచలు కట్టుకుపోయి దుర్గదపు వాసనలో దయనీయ స్థితిలో ఉన్న అనాధలకు సపర్యసేవలు చేసింది ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ. దీని ఆధ్వర్యంలో పెరిగిన గడ్డం, అట్టలు కట్టిన జుట్టు, చిరిగిన బట్టలతో అస్దవేస్దంగా పడిఉన్న విధి వంచితులకు కేశాలను తోలగించి, అనంతరం శుభ్రంగా స్నానం చేయించి, కొత్త దుస్తులు వేయ్యటం జరిగింది. ఒంటిపై పుండ్ల నుండి రక్తం కారుతు నరకయాతన అనుభవిస్తున్న అనాధ విధి వంచితులు. వారి అలాన పాలన చూసుకునే నాధుడే లేరు. అలాంటి వారిని మాములు మనుషులుగా చేస్తు అండగా నిలుస్తుంది ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ. ఇందుకు 1వ ఠాణా పోలిస్ సిబ్బంది, రైల్వే పోలీస్ సిబ్బంది సహకరించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు,కోశాధికారి జయదేవ్ వ్యాస్, జంగం రాజు, సుజాత, లాస్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -