నవతెలంగాణ – ఉప్పునుంత
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఫోటో ఎక్స్‌పో–2025 ఈ నెల (సెప్టెంబర్ 19, 20, 21 న నర్సింగి, హైదరాబాద్) లో జరిగే ఎక్స్పో కార్యక్రమాన్ని గురువారం పోస్టర్‌ను ఉప్పునుంతల ఎస్సై వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు బొల్లు శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సురివి కృష్ణ, అచ్చంపేట తాలూకా అధ్యక్షులు తాటికొండ గిరి, మండల సెక్రటరీ బరిగేల ఆనంద్, కోశాధికారి భోగరాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో కేశవులు, సాజిద్, మల్లేష్, రాజు, రాముతో పాటు ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులు హాజరై ఎక్స్‌పో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఫోటోగ్రఫీ రంగానికి మరిన్ని అవకాశాలు తెచ్చే ఈ ఎక్స్‌పోలో అధునాతన సాంకేతిక పరికరాలు, కొత్త ట్రెండ్స్ ప్రదర్శనకు రానున్నాయి అని ఎక్స్పో ఆవిష్కరణలో వారు తెలిపారు.