Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

 నవతెలంగాణ – భీమ్‌గల్
అనుమతి లేకుండా ఇతర గ్రామాల నుండి వచ్చే వారితో చర్చిని నిర్వహిస్తూ, అక్రమంగా చర్చిని నిర్మిస్తూ, తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని మాల సంఘ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ తాత ముత్తాతల తరాల నుండి తాము ఇక్కడ నివసిస్తున్నమని, కానీ ఎక్కడ నుండో బ్రతకవచ్చిన పాస్టర్ ,ఇతర గ్రామాల నుండి వచ్చే వారితో అక్రమంగా చర్చిని నిర్వహిస్తూ, అనుమతులు లేకుండా చర్చిని నిర్మిస్తు,తమ పై పెత్తనం చెలాయిస్తూ తము నీవసిస్తున్న ఇండ్ల స్థలాల పై కన్ను వేశాడని ఆరోపించారు. తమ కాలనీ స్థలం మొత్తం తనదే అని చెప్పుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తునారన్నారు.

ఈ విషయం పై అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకుంటలేరని,అందుకు తాము మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. అనుమతి లేకుండా జనావాసాలు మధ్యలో అక్రమంగా చర్చి నిర్వహిస్తు,చర్చి గోడలను నిర్మిస్తున్న పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని లేని యేడల నిరవధిక దీక్ష చేపడతామని హేచ్చరించారు.దీంతో మండల తహసీల్దార్,కమిషనర్ , ఎస్సై, వచ్చి కాలనీ వాసులతో చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో అక్రమంగా చర్చి గోడలను నిర్మిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయం పై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళమని 15 రోజుల్లో సర్వే నిర్వహించి, న్యాయం చేస్తామని,చర్చి అనుమతి లేకుండా నిర్వహిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు శాంతించారు.15 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే కాలనీ వాసులు నిరవధిక దీక్ష చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -