నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వన మహోత్సవం కార్యక్రమం కోసం నర్సరీల్లో సిద్ధం చేసిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని నర్సరీ నిర్వాహకులకు ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ సూచించారు. గురువారం మండలంలోని ఉప్లూర్, రాజరాజేశ్వరీ నగర్, నాగాపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను ఆయన పరిశీలించారు. మొక్కల సంరక్షణపై నర్సరీ నిర్వహకులకు పలు సూచనలు చేశారు. నర్సరీలో ప్రస్తుతం ఉన్న మొక్కల రకాలను అడిగి తెలుసుకున్నారు.
వన మహోత్సవంలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో హరితహారంలో నాటిన, ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు ప్రస్తుతం నర్సరీలో ఉన్న మొక్కలు ఉపయోగపడతాయన్నారు. అప్పటివరకు మొక్కల్ని జాగ్రత్తగా సంరక్షించాలన్నారు.మొక్కల సంరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించోద్దని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు రాఘవేందర్, స్వరూప, సంధ్య, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES