Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసుపు పరిశోధన స్థానాన్ని సందర్శించిన గిరిరాజ్ ళాశాల విద్యార్థులు

పసుపు పరిశోధన స్థానాన్ని సందర్శించిన గిరిరాజ్ ళాశాల విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం శివారులోని శ్రీ కొండా లక్ష్మణ్, ఉద్యానవన యూనివర్సిటీ, పసుపు పరిశోధన స్థానాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు గురువారం సందర్శించారు. గిరిరాజ్ కళాశాల బయోటెక్నాలజీ విభాగానికి చెందిన 25 మంది  విద్యార్థులు, అధ్యాపకులు పసుపు పరిశోధన స్థానాన్ని సందర్శించారు. పసుపు పరిశోధన స్థానంలో వివిధ కొత్త రకాల పసుపు వంగడాల సృష్టిపై  జరుగుతున్న  పరిశోధనలు, పసుపు రకాలను, పరిశోధన ల్యాబ్ ను విద్యార్థులు, అధ్యాపకులు పరిశీలించారు. పరిశోధన కేంద్రం సందర్శనకు విచ్చేసిన గిరిరాజ్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు, అధ్యాపకులకు  పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ 

 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కొత్త పసుపు వంగడాల పరిశోధనల వివరాలు, పసుపు సాగు పద్ధతులు, తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త భాస్కర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -