నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ఓ రోగిపట్ల ఆస్పత్రి సిబ్బంది అవమానకరంగా వ్యవహరించారు. సి.వడివేలు (84) అనే వ్యక్తి డయోబెటిక్ ఫుట్ అల్సర్‌తో బాధపడుతున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను కుమారుడు కాళిదాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తీసుకొచ్చారు. తండ్రిని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బందిని వీల్‌ఛైర్ కోరగా.. వారు రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తామన్నప్పటికీ 30 నిమిషాలు వేచి ఉండాలని పేర్కొన్నారు. దీంతో అంత సేపు వేచి ఉండలేక.. ఆయన తన తండ్రిని లాక్కెళ్లాల్సి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి నిలయంగా మారాయంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఈ ఘటన నేపథ్యంలో ఇద్దరు కాంట్రాక్టు సూపర్‌వైజర్లను అధికారులు సస్పెండ్ చేశారు.
లంచం ఇవ్వనందకు వీల్ చైర్ నిరాకరణ..తండ్రిని మోసుకెళ్లిన యువకుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES