Friday, September 12, 2025
E-PAPER
Homeఆటలుదీపిక కుమార్‌ అవుట్‌

దీపిక కుమార్‌ అవుట్‌

- Advertisement -

ప్రీ క్వార్టర్స్‌లో ఖడకె
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌

గాంగ్జూ (దక్షిణ కొరియా) : ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌ కాంపౌడ్‌ విభాగంలో చారిత్రక మెన్స్‌ టీమ్‌ పసిడి పతకంతో పాటు, మిక్స్‌డ్‌ టీమ్‌ రజత పతకం సాధించిన టీమ్‌ ఇండియా.. రికర్వ్‌ విభాగంలో నిరాశపరిచింది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో భారత స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి పోటీ నుంచి నిష్రమించింది. గురువారం జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 32లో ఇండోనేషియా ఆర్చర్‌ చేతిలో ఐదు సెట్ల మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అర్హత రౌండ్‌లో ఆరో స్థానంలో నిలిచి నేరుగా రౌండ్‌ ఆఫ్‌ 32కు చేరుకున్న దీపిక కుమారి దారుణంగా విఫలమైంది. భారత యువ కెరటం, 15 ఏండ్ల గాథ ఖడకె మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత పతక ఆశలను మోస్తోంది. నేడు ప్రీ క్వార్టర్‌ఫైన్లలో వరల్డ్‌ నం.1, పారిస్‌ ఒలింపిక్‌ పసిడి పతక విజేత లిమ్‌ షితో ఖడకె పోటీపడనుంది. కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్న కొరియా ఆర్చర్‌ 6-2తో అంకితపై సూపర్‌ విజయంతో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -