సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటనలివి
కవిన్ కుటుంబాన్ని పరామర్శించిన బృందాకరత్
చెన్నై : తిరునల్వేలిలో ఇటీవల జరిగిన కులదురహంకార హత్యకు గురైన కవిన్ సెల్వ గణేష్ కుటుంబాన్ని సీపీఐ(ఎం) నాయకురాలు బృందాకరత్ పరామర్శించారు. అగ్ర కులానికి చెందిన మహిళతో సంబంధం ఉందనే ఆరోపణలతో దళితుడైన కవిన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కవిన్ కుటుంబ సభ్యులను గురువారం బృందాకరత్ కలిసి ఓదార్చారు. వారి కుటుంబానికి పగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన హంతకులను కఠినంగా శిక్షించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కవిన్ కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆమె వెంట సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, కేంద్ర కమిటీ సభ్యుడు పి. సంపత్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు కె. కనగరాజ్, కె. అర్జునన్, తదితరులు ఉన్నారు.