అందుకు తగిన ఆధారాలు ఇవ్వబోతున్నాం : ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
రాయ్ బరేలీ : ఓట్ల చోరీకి సంబంధించి త్వరలో విస్పోటనం సృష్టించే ఆధారాలను ఇవ్వబోతున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓట్ల చోరీ విషయంలో శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని ఇటీవల ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ గురువారం మరోసారి పునరుద్ఘాటించారు. ఉత్తర ప్రదేశ్‌లోని లోక్ సభ నియోజక వర్గం రారు బరేలీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ఓట్ల దొంగతనం జరిగిందనేది వాస్తవం. మేం మీకు శక్తివంతమైన బాంబు పేలేలా ఉండే సాక్ష్యాలను ఇవ్వబోతున్నాం. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఓట్లను దొంగలించడం ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని అందిస్తామని హామీ ఇస్తున్నాం.’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
త్వరలో విస్పోటనం సృష్టిస్తాం
- Advertisement -
- Advertisement -