- Advertisement -
స్కూట్ ఎవిరివేర్ సేల్ ఆఫర్లు
న్యూఢిల్లీ : సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బడ్జెట్ విమానయాన కంపెనీ స్కూట్ అతి తక్కువ ధరల్లో విదేశీ ప్రయాణాలను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. స్కూట్ ఎవిరివేర్ సేల్ ఆఫర్‌లో భాగంగా చెన్నరు నుంచి సింగపూర్‌కు రూ.5,900కే ప్రయాణాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. విశాఖపట్నం నుంచి బాలికి రూ.9,000, కోయంబత్తూరు నుంచి మెల్‌బోర్న్‌కు రూ.19,500కు, తిరువనంతపురం నుంచి జకార్తకు రూ.8,500తోనే ప్రయాణించ వచ్చన్నారు. ఈ బుకింగ్ ఆఫర్ సెప్టెంబర్ 14వరకు మాత్రమే ఉంటుందని.. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి 2026 ఆగస్టు 31 లోపు ప్రయాణిల కోసం బుకింగ్స్‌ను తెరిచినట్లు వెల్లడించింది.
- Advertisement -