పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మహానగరం ఐటీ నుంచి లైఫ్ సైన్సెస్ వరకు, అధునా తన తయారీ పరిశ్రమలతో ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీస్ (సీఐఐ) శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ (సీఎఫ్‌వోలు) అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, మంచి వాతావరణం, ఔటర్ రింగ్ రోడ్డు, గొప్ప ఎయిర్‌పోర్టు హైదరాబాద్ సొంతమని చెప్పారు. ఇక్కడ భాష సమస్య లేదని గుర్తు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, త్రిబుల్ ఐటీతోపాటు పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయని వివరించారు. అందువల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
రండి.. పెట్టుబడులు పెట్టండి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES