Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి

గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి

- Advertisement -

అప్పీల్‌కు వెళ్లడం సరికాదు :దాసోజు శ్రవణ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌- 1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. రూ. కోట్లకు గ్రూప్‌ 1 ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాడిన న్యాయవాదు లకు ధన్యవాదాలు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉండే అర్హత కోల్పోయిందని విమర్శించారు. కోర్టు తీర్పులు బేఖాతరు చేసి విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రెస్‌క్లబ్‌ వచ్చి హైకోర్టు తీర్పుపై చర్చించాలని సవాల్‌ విసిరారు. ప్రభుత్వం రిట్‌ అప్పీల్‌ కు వెళ్లొద్దనీ, జీవో 29ను రద్దు చేయాలనీ, విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహ రించుకోవాలని కోరారు. హైకోర్టు తీర్పుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లా డటం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎవరి కోసం జీఓ నంబర్‌ 29 తెచ్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులను, అన్ని సంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తామనీ, మంత్రులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చ రించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, బీఆర్‌ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్‌ , కొడంగల్‌ బీఆర్‌ఎస్‌ నేత మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -