Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధిక రేట్లకు యూరియా అమ్ముతున్న డీలర్.. 

అధిక రేట్లకు యూరియా అమ్ముతున్న డీలర్.. 

- Advertisement -

మాకు సరిపడా యూరియా అందించాలని లింగుపల్లి రోడ్డు పైన బైఠాయించిన రైతులు 
నవతెలంగాణ – మిరుదొడ్డి

యూరియా కోసం వెళ్తే తమ గ్రామ రైతులకు యూరియా బస్తాలు ఇవ్వం అని పర్టిలైజర్ షాపు వాళ్ళు చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. ఎక్కడికి వెళ్ళినా తమ గ్రామస్తులకు యూరియా కోసం ఇబ్బందులు కలుగుతున్నాయంటూ మల్లుపల్లి రైతులు రాస్తారోకో చేపట్టారు.  మిరుదొడ్డి మండలం లింగుపల్లి చౌరస్తా వద్ద మల్లుపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు.

రుద్రారం రైతు వేదిక క్లస్టర్ పరిధిలో మల్లుపల్లి గ్రామం ఉన్నప్పటికీ, యూరియా వచ్చిందని అక్కడికి వెళ్తే మల్లుపళ్లి రైతులకు యూరియా ఇవ్వడం లేదని వాపోయారు. యూరియా ఇవ్వాలని పర్టీలైజర్ నిర్వాహకులను అడుగుతే, ఇవ్వమని దురుసుగా మాట్లాడడం జరుగుతుందని ఆరోపించారు. ఫర్టిలైజర్ నిర్వాహకులపై చర్య తీసుకోవడంతో పాటు తమ గ్రామానికి యూరియా లారీని తెప్పించాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గంటపాటు రాస్తారోకో చేయడంతో దుబ్బాక సిఐ శ్రీనివాస్ చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడి యూరియా లారీ వచ్చే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -