నవతెలంగాణ – జమ్మికుంట
ట్రస్మా పూర్వ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు అన్నారు.జమ్మికుంట పట్టణం లోని న్యూ మిలీనియం స్కూలులో ఉమ్మడి కరీంనగర్ , వరంగల్ జిల్లాల బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాల సమావేశం శనివారం స్థానిక మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ స్కూళ్లకు రావాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్న అంశంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంటర్ మీడియట్ , డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వలె స్కూళ్లు కూడా సహాయ నిరాకరణ బాటలో పయనించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పాఠశాల దసరా సెలవుల తర్వాత పునః ప్రారంభం కష్టతరం అవుతుందని, కాబట్టి బాస్ స్కీమ్ పిల్లల తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తుకు నీలు నీడలు కమ్ముకున్నాయన్నారు. తల్లిదండ్రులు మీ జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిన అధికారులు, మంత్రులు ,ప్రజా ప్రతినిధులు వెళ్లి పాఠశాలలకు రావాల్సిన బకాయిలు చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం చేయలేని పరిస్థితి ఉంది కావున ఈ నెల 18 లోపు బకాయిలు చెల్లించని పక్షంలో తదుపరి కార్యాచరణను విడుదల చేస్తామని చెప్పారు.
వృత్తి విద్యా కళాశాలలు జూనియర్, డిగ్రీ కళాశాలలు వారి కార్యాచరణకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రవేట్ స్కూళ్ల యాజమాన్యాల సంఘం పూర్వ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ప్రస్థుత జిల్లా అధ్యక్షులు కోరం సంజీవ రెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ ముసిపట్ల తిరుపతి రెడ్డి , జమ్మికుంట పట్టణ అధ్యక్షులు డా. పుల్లూరి సంపత్ రావు , లక్ష్మారెడ్డి, శ్రీనివార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.