Sunday, September 14, 2025
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఆరంభం

హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఆరంభం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : 22వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ శనివారం ఘనంగా ఆరంభమైంది. కోకాపేట్‌లోని విజయ్ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఆరంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐపీఎల్‌ అధికారి వినీత్‌ పోటీలను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో అన్ని వయస్కుల ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొనటం హర్షనీయమని, ఆల్‌ ఇండియా స్థాయి పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు వినీత్‌ అభినందించారు. సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో 30-75 వయో విభాగాల్లో పోటీలను లేక్‌వ్యూ అకాడమీలో సైతం నిర్వహిస్తున్నారు. దేశవ్యప్తంగా 360 మంది పోటీపడుతుండగా.. క్రీడాకారులకు ఉచిత భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. విజేతలకు రూ. 1 లక్ష నగదు బహుమతి అందిస్తున్నామని హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఓటీఏ) అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి రామకష్ణ, హెచ్‌ఓటీఏ ఆపీస్‌ బేరర్లు సదాశివ రెడ్డి, చక్రధర్‌, పథ్వీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -