జపాన్‌పై 1-1తో డ్రా
మహిళల హాకీ ఆసియా కప్
గాంగ్షు (చైనా) : మహిళల హాకీ ఆసియా కప్‌లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో జపాన్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న టీమ్ ఇండియా.. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై చైనా విజయం సాధించటంతో టైటిల్ పోరుకు చేరుకుంది. తొలుత జపాన్, భారత్ మ్యాచ్‌లో స్పష్టమైన ఫలితం రాలేదు. ఏడో నిమిషంలోనే బ్యూటీ డంగ్ ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. మూడు క్వార్టర్ల వరకూ ఆధిక్యం నిలుపుకున్న భారత అమ్మాయిలు.. ఆఖరు మూడు నిమిషాల ఆటలో తడబాటుకు గురయ్యారు. 58వ నిమిషంలో జపాన్ అమ్మాయి షిహో ఫీల్డ్ గోల్ సాధించింది. దీంతో 1-1తో స్కోర్లు సమం అయ్యాయి. భారత్‌కు ఆరు పెనాల్టీ కార్నర్‌లు లభించినా.. గోల్స్‌గా మలచటంలో విఫలమైంది. భారత్‌ను వెనక్కి నెట్టి దక్షిణ కొరియా ఫైనల్‌కు చేరేందుకు.. అగ్రజట్టు చైనాపై రెండు గోల్స్ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే మెరుగైన గోల్స్ తేడాతో ఆ జట్టు ముందంజ వేయగలదు. చైనా 1-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించటంతో సూపర్4 దశలో రెండో స్థానంలో నిలిచిన భారత్ టైటిల్ పోరుకు చేరుకుంది. నేడు జరిగే టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో భారత్ ఢకొీట్టనుంది. మూడో స్థానం కోసం జపాన్, దక్షిణ కొరియా తలపడతాయి. ఆసియా కప్ విజేతగా నిలిచిన జట్టు 2026 హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధించనుంది.