Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో వెలగని హైమాస్ లైట్లు

గ్రామాలలో వెలగని హైమాస్ లైట్లు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో  హైమాస్ లైట్లు గత కొన్ని ఏళ్లుగా వెలగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులైన రూర్బన్ పథకంలో ఎంపీ లార్డ్స్ నిధులతో ఒక్కోక్కటి కొన్ని ఐదు లక్షలు , ఇంకొన్ని మూడు లక్షలు లక్షల రూపాయలు వెచ్చించి రూర్బన్ నిధులతో , ఎంపీ లార్డ్స్ నిధుల తో గ్రామాలలో ముఖ్యమైన కూడళ్లలో హైమాస్ విద్యుత్ లైట్లను ఏర్పాట్లు చేశారు. గ్రామాలలో ఈ లైట్ల వలన వందల మీటర్ల వరకు వెలుతురు విరజిల్లుతు గ్రామం మొత్తానికి వెలుగు నింపేది. ప్రస్తుతము దీని ఆలనా పాలన లేకపోవడంతో మరుగునపడి గ్రామాలలో ముఖ్య కూడళ్లలలో ముఖ్యమైన  ప్రాంతాలలో చిమ్మ చీకటిగా  మారింది.

మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో దాదాపుగా అన్ని పంచాయతీలకు హైమాస్లైట్లను మంజూరు చేయడం జరిగి వాటిని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ఆలన పాలనకు కాంట్రాక్టు పద్ధతిలో ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో వాటి ఆలన పాలనలో గతిలేక నిర్వాహకుడు అత్తాకు లేకుండా పోయాడు. ప్రారంభం నాటి నుండి ఈ సమస్య గ్రామపంచాయతీలో నెలకొని ఉన్న ఎవ్వరు పట్టించుకోకపోవడంతో మండలంలో కోట్లాది రూపాయలు లక్షల  వెచ్చించి ప్రజాధనం వృధా చేశారు.

మెయింటెనెన్స్ చేయాల్సిన నిర్వాహకుడు అద్దాకు లేకుండా పోవడంతో అధికారులకు పని మార్లు గ్రామాలకు వచ్చినప్పుడు విన్నవించిన గ్రామపంచాయతీకి తిరిగింది లేవని నాకు చెబుతూ వాటి పునర్నిర్మానం చేయడం లేదు. ఇప్పటికైనా సంబంధిత మెయింటెనెన్స్ విలువ గురించి అధికారులు సంజాయిసి తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామాలలోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే గ్రామపంచాయతీలు హైమాస్ లైట్లు రిపేర్ కొరకు నిధులు కేటాయించి వాటిని ఉపయోగించి తీసుకురావాలని ప్రజాధనం వృధా కాకుండా చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -