Sunday, September 14, 2025
E-PAPER
Homeక్రైమ్పిట్లంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

పిట్లంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

–  సేవ చేయలేక, ఇంట్లో దుర్వాసన వస్తుందని కన్నతల్లిని హత్య చేసిన కుమారుడు
– హత్యకు సహకరించిన వ్యక్తి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
– నేరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసుల నుంచి తప్పించుకోలేరు
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర 
నవతెలంగాణ – కామారెడ్డి 

సమాజంలో రోజురోజుకు మానవత్వ విలువలు మంట కలుస్తున్నాయి. ఒక తల్లి తన పిల్లలు మల మూత్ర విసర్జనాలు చేసిన ఎంత అల్లరి చేసినా భరిస్తూ వారిని పెంచి పెద్ద చేస్తుంది. పిల్లలు మాత్రం పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు సేవ చేయలేక అనాథ ఆశ్రమాల్లో వదిలివేయడం లేదా సేవ చేయలేక మలమూత్ర విసర్జనలు వెళితే దుర్వాసన వస్తుందని, కన్న తల్లిదండ్రులని హత్యలు చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బొర్లం గ్రామంలో చోటుచేసుకుంది.

ఆదివారం బాన్సువాడ సిఐ తెలిపిన వివరాల ప్రకారం.. 11.09.2025 మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో బొల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని మహిళ (వయస్సు సుమారు 70-75 సంవత్సరాలు) శవం కనిపించింది. ఈ విషయం పై బొర్లం గ్రామపంచాయతీ కార్యదర్శి గంగుల శివాజీ ఫిర్యాదు మేరకు పిట్లం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుర్తు తెలియని మహిళ శవం ఫోటోలను సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించి, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్ చేసి సమాచారాన్ని అందరికీ చేరేలా చేశారు.

తేదీ 12.09.2025 నా ఉదయం సుమారు 6 గంటలకు బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ పెద్దలు ఒక వ్యక్తి ( ఎ – 2 సీసీఎల్ ) ని నువ్వు, ఎర్రోళ్ల బాలయ్య ఇద్దరు కలిసి సాయవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లినరు కదా ఏమైనధి అని అడుగగా ధానికి అతను  గ్రామ పెద్దమనుషులకు హత్య జరిగిన విధానాన్ని వివరించాడు. ఎర్రోళ్ల బాలయ్య ( 46 సంవత్సరాలు ) తన తల్లి సాయవ్వ ( 77 సంవత్సరాలు ) ఆరోగ్యం బాగాలేదని, ఇంట్లోనే పడుకున్న దగ్గర  మల మూత్ర విసర్జన చేస్తున్నది, ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ లేరని, ఇల్లు వాసన వస్తోందని చెప్పి తేది 08.09.2025 రాత్రి 9:00 గంటల సమయంలో తన బైక్‌పై  బొల్లక్ పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి, బ్రిడ్జ్ మీద నుండి మంజీర నదిలోకి తోసివేసి హత్య చేసినాము అని తెలిపాడు.

తేది 14.09.2025 న నమ్మదగిన సమాచారంపై బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట చౌరస్తా వద్ద నిందితులు ఎ – 1 ఎర్రోళ్ల బాలయ్య , ఎ – 2  సీసీఎల్   బోర్లం నుండి కొయ్యగుట్ట కు వస్తుండగా అరెస్టు చేసి, హత్యలో ఉపయోగించిన బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రోళ్ల బాలయ్యను  రిమాండ్‌కు తరలించారు. జూవేలైన్ బాలుడును జువెనేల్ అబ్జర్వేషన్ హోం కు తరలించడం జరిగిందన్నారు.  హత్య కేసు చేదనలో బాన్సువాడ డిఎస్పి విటల్ రెడ్డి, పర్యవేక్షణలో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్ఐ వెంకట రావు,  సిబ్బందిని జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర  అభినందించి నేరం చేసిన వ్యక్తులు ఎవరైనా చట్టం నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -