- Advertisement -
– 15న వ్యాయామ ఉపాధ్యాయులతో సన్నాహక సమావేశం: ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 16 వ తేదీ మంగళవారం నిర్వహించనున్న పాఠశాల జోనల్ స్థాయి క్రీడలు నిమిత్తం 15 వ తేదీ సోమవారం అశ్వారావుపేట బాలికోన్నత పాఠశాలలో దమ్మపేట – అశ్వారావుపేట వ్యాయామ ఉపాధ్యాయులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసామని ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు ఆదివారం తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు అయి క్రీడా నిర్వహణ పై కార్యాచరణ ను విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -