Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివా డివిజన్ తరపున ఆర్థిక సహాయం అందజేత 

వివా డివిజన్ తరపున ఆర్థిక సహాయం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని గోవింద్ పెట్ గ్రామానికి చెందిన సింగారం శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో వివా డివిజన్ తరపున రూ. 13,000 వేల ఆర్థిక సహాయం అధ్యక్షులు గద్దె గంగాధర్  చేతుల మీదుగా ఆదివారం అందజేసినారు. విశ్వకర్మకు ఆర్థిక సహాయం కొరకు అర్థించగా  సభ్యులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంలో ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సభ్యునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మన సహకారం ఆయన త్వరగా కోలుకోవడానికి తోడ్పడాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారాం ,కోశాధికారి నటరాజ్, జిల్లా బాధ్యులు బొమ్మెన శంకర్, వెంకటరమణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -