నవతెలంగాణ – భువనగిరి
పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన తప్పిదాలతోనే ప్రస్తుతం ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వాటిని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సరి చేస్తున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్‌చిస్తీ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో జగదేవ్‌పూర్ – భువనగిరి రోడ్డు బాగు చేయ్యని వారు ప్రస్తుతం మాట్లాడడం విడ్డూరమన్నారు. భువనగిరి మున్సిపాలిటీలో అనాలోచిత పనుల వల్ల పట్టణంలో పనులు అస్తవ్యస్తంగా మారిందని వాటిని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సరి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని డీపీఆర్ తయారు చేసిందని రెండు రోజులలో సర్వేకు జాతీయ రహాదారి అధికారులు వస్తున్నట్లు తెలిపారు. ప్రతి పక్ష పార్టీల పాత్రా ఉండాలని కానీ మితిమిరిన విధాంగా ఉండకుడాదని హెచ్చరించారు. హెచ్‌ఎండీ నుంచి రూ. 56 కోట్లు నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ఎమ్మెల్యేకు ప్రస్తుతం 24 కోట్లు పనులు కేవలం భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతున్నట్లు ఇందులో నల్లగొండ– హైద్రాబాద్ చౌరస్తా వరకు రోడ్డు, పాత బస్టాండ్ నుంచి హన్మాన్‌వాడ రోడ్డు తోపాటు ప్రధాన చౌరస్తాల సుదరీకణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ నియోజకవర్గాలు పూనర్ విభజన నేపధ్యంలో వలిగొండ నియోజకవర్గం అవుతుందని నిధులు అన్ని అక్కడికే తీసుకెళ్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని భువనగిరి నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే కుమార్తె కీర్తీరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలలో పార్టీ గెలువాలని ఉద్దేశ్యంతోనే లేని సమస్యలు సృష్టించి ఆదోళనలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు కూర వెంకటేశం, బర్రె జహాంగీర్, కె. సోమయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, లయిఖ్‌అహ్మద్, ఈరపాక నర్సింహా ఉన్నారు.
అసమర్ధత పాలన వలనే ప్రజలు ఇబ్బందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES