- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్ల దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లు అందరికీ ముఖ్యమంత్రి ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబర్ 15 ను పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేకతను చాటారని తెలిపారు.
- Advertisement -