‘కందిలి’ ఆవిష్కరణ సభ
తెలంగాణ కథల సంకలనం ‘కందిలి’ ఆవిష్కరణ సభ ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఖమ్మం వదేఇక ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఇందులో ఎన్.వేణుగోపాల్, సంగిశెట్టి శ్రీనివాస్, పెట్టింది అశోక్ కుమార్, జూపాక సుభద్ర, సిద్దంకి యాదగిరి, డా||ధరణికోట రమేష్ కుమార్, ప్రసేన్, సీతారాం, రవిమారుత్ పాల్గొంటారు.
జాతీయ బాలచెలిమి కథల పోటీ – 2025
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్, బాలచెలిమి సంపాదకులు శ్రీ మణికొండ వేదకుమార్ సారథ్యంలో, బాలల దినోత్సవం-14వ నవంబర్ 2025 సందర్భంగా జాతీయ స్థాయిలో బాలచెలిమి కథల పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలకోసం పిల్లలు పెద్దలు ఎవరైనా పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాలు – నివారణ, మానవతా నైతికవిలువలు, దుర్వ్యసనాలకు దూరంగా వుండేట్టుగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రసాంకేతికాలతో కూడిన కథలను చేతిరాతలో మూడు, టైపులో 2 పేజీలకు మించని కథలను సెప్టెంబర్ 20 లోపు ‘బాల చెలిమి కథల పోటీ, భూపతి సదన్, ఇ. నం: 3-6-716, స్ట్రీట్ నం: 12, హిమాయత్ నగర్, హైదరాబాద్ -500029, తెలంగాణ’ , E mail: edit.chelimi@gmail.com ఇ మెయిల్‌కు గానీ, పంపాలి. వివరాలకు: 8686664949, 9030626288. గరిపెల్లి అశోక్, 9849649101.
మల్లెతీగ కథలు, కవితల పోటీ
ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం – ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ సౌజన్యంతో, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో కథలు, కవితల పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి సమకాలీన సామాజిక సమస్యల్ని, ప్రశార్థకమౌతున్న మానవతా విలువల్ని స్పశిస్తూ, తెలుగువారి జీవన సంస్కతిని ప్రతిబింబించే భిన్నమైన కథల్ని, కవితల్ని ఆహ్వానిస్తున్నాం. కథలు, కవితలు డీటీపీ చేసి గానీ, యూనికోడ్ ఫాంట్ లో గాని పంపాలి. కథలు 3 నుండి 5 పేజీలకు, కవితలు నలభై లైన్లకు మించకూడదు. కథలు, కవితలు అక్టోబరు 15వ తేదీలోగా malleteega.sss@gmail.com ఈ మెయిల్‌కు అందాలి. సంప్రదింపులకు – 92464 15150.
కలిమిశ్రీ, మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ అధ్యక్షులు
సాహితి సమాచారం
- Advertisement -
- Advertisement -