Monday, September 15, 2025
E-PAPER
Homeమానవిమౌత్‌వాష్‌.. ఇంట్లోనే ఇలా..

మౌత్‌వాష్‌.. ఇంట్లోనే ఇలా..

- Advertisement -

మౌత్‌ వాష్‌లను కొనాలంటే కాస్త ఇబ్బందికరమైన అంశంగానే చెప్పొచ్చు. ముఖ్యంగా మార్కెట్లో లభించే మౌత్‌ వాష్‌ల కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇంట్లో లభించే కొన్ని సహజ వస్తువులు మౌత్‌ వాష్‌లుగా ఉపయోగపడుతాయి. అవేంటో చూద్దాం..
– సాధారణంగా చలికాలంలో దంతాలు సెన్సిటివ్‌గా మారుతాయి. ఇలాంటి సమయంలో సాల్ట్‌, బేకింగ్‌ సోడాతో చేసిన మౌత్‌ వాష్‌లు బాగా ఉపయోగపడుతాయి. ఇందుకోసం ఒక గ్లాస్‌ నీటిలో అర చెందా ఉప్పు, అర చెంచా బేకింగ్‌ సోడా వేసి కలపాలి. దీంతో నోటిని శుభ్రం చేసుకుంటే నోరు శుభ్రంగా ఉంటుంది. ఇది మంచి యాంటీ బ్యాక్టిరీయల్‌గా పనిచేస్తుంది.
– నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నూనె బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కొబ్బరి నూనె నోటి సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్యూర్‌ కొబ్బరి నూనెను నీటిలో కలుపుకొని నోట్లో వేసుకొని కొద్దిసేపు పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టొచ్చు.
– ఇక నోటి పూత సమస్యతో బాధపడే వారు పసుపుతో చేసిని మౌత్‌ వాష్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. చిగుళ్ల వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ మౌత్‌ వాష్‌ను తయారు చేసుకోవడానికి 4 లవంగాలను కప్పు నీటిలో నానబెట్టాలి, దానిలో కొంచెం పసుపు, అర టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి కలపాలి. దీనిని నోట్లో వేసుకొని పుక్కిలించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -