- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ జట్టును దారుణంగా సూర్యకుమార్ సేన ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లోనూ అత్యంత ప్రమాదంగా ఆడిన టీమిండియా… పాకిస్థాన్ పై విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చివరి వరకు నిలబడి.. జట్టుకు విజయాన్ని అందించారు. 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. దీంతో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో సూపర్ 4 కు మార్గం సుగమం చేసుకుంది.
- Advertisement -