2015 పేలుళ్ల కేసులో ఈ నెల 8న తీర్పు వెలువరించిన థానె కోర్టు
థానె : 2015 థానె అలర్ల కేసులో.. పదేండ్ల అనంతరం స్థానిక కోర్టు 17మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసు నిర్థారణలో పూర్తి వైఫల్యం, దర్యాప్తులో తీవ్రమైన లోపాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుని నేరంపై సందేహం తప్ప నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం సరిపోలేదని అదనపు సెషన్స్ జడ్జి వసుధ ఎల్.బోసలే ఈ నెల 8న ఇచ్చిన తీర్పులో వెల్లడించారు. తీర్పు కాపీని ఆదివారం కోర్టు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచింది. నివేదిక ప్రకారం.. 2015, జనవరి 2న థానే జిల్లాలోని దివా రైల్వేస్టేషన్‌లో అల్లర్లు జరిగాయి. సాయుధ దుండగుల బందం రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్ప డింది. వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసు అధికారులపై విరుచుకు పడింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 19మందిని అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉండగానే నిందితుల్లో ఇద్దరు మరణించారు. గుర్తింపులో పూర్తిగా వైఫల్యం, వైద్య, స్వతంత్ర ఆధారాలు లేకపోవడం, దర్యాప్తులో తీవ్రమైన లోపాలు న్నాయని కోర్టు అభిప్రాయపడింది. అందుకే మిగిలిన 17మంది నిందితులపై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేస్తూ.. నిర్దోషులుగా ప్రకటించింది.