జలమయమైన రహదారులు.. ట్రాఫిక్‌తో ప్రజల ఇక్కట్లు
అఫ్జల్‌సాగర్ డ్రెయిన్‌లో కొట్టుకుపోయిన మామాఅల్లుళ్లు
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గోడకూలి ఇద్దరు మృతి !
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వానలు
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/సిటీ బ్యూరో
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం రాత్రి గంటల వ్యవధిలోనే పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలోనే హబీబ్‌పూర్ పరిధిలోని అఫ్జల్‌సాగర్ డ్రెయినేజీలో మామా అల్లుళ్లు కొట్టుకుపోయారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో గోడకూలి ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. దాన్ని నిర్ధారించాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలోని పలు కాలనీల్లోని ఇండ్లలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల వ్యవధిలో అతి భారీ వర్షం పడటంతో నగర రోడ్లన్నీ జలమయమై పోయాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. రాష్ట్రవ్యాప్తంగా 362 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైతే అందులో 130కిపైగా ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో నగరంలోని రహదారులు జలమయ మైపోయాయి. ట్రాఫిక్‌తో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి అన్నారం లో అత్యధికంగా 12.75 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలోని ముషీరాబాద్‌లో 12.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జంజారాహిల్స్, జూబ్లీహి ల్స్, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, తార్నాక, లక్డికాపూల్, మల్కాజిగిరి, కాప్రా, మారేడుపల్లి, సరూర్‌నగర్, ముషీరాబాద్, హిమాయత్ నగర్, కాచిగూడ, ఉప్పల్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, సైనిక్‌పురి, కూకట్‌పల్లి, గాజుల రామారం, అల్వాల్, దిల్‌సుఖ్‌నగర్ సహా తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దాంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, కాలనీల్లోకి నీరు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల సెల్లార్లు నీటితో నిండిపో యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల నుంచి నడుంలోతు వరకు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం ఇండ్లకే పరిమిత మయ్యారు. ప్రధాన రహదారులు మొదలుకొని అంతర్గత రహదారులు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు నీటిలో మునిగాయి. ఫ్లై ఓవర్లపైన కూడా మోకాళ్లలోతు నీరు నిలిచింది.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-12 కమాండ్ కంట్రోల్ వద్ద రోడ్డుపైన భారీ ఎత్తున నీళ్లు నిలిచాయి. దాంతో అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిలిచిన వర్షపు నీటినిహైడ్రా అధికారులు, సిబ్బంది డైవర్ట్ చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యవేక్షిం చారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షం కారణంగా గోడ కూలి ఇద్దరు మృతిచెందారని సమాచారం. డీఆర్‌ఎఫ్ మాన్సున్ టీమ్స్ రంగంలో కి దిగాయి. వర్షపునీరు చేరిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తు న్నాయని పేర్కొన్నారు.
వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య ప్రాంతం మీదుగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ వరకు కేంద్రీకృతమైంది. ఇది సముద్ర మట్టం నుంచి 3.1 – 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది. నైరుతి రుతుపవనాలు సాధారణ తిరోగమనం సెప్టెంబర్ 17 అయినప్ప టికీ ముందుగానే ఈ రోజు పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించబడ్డాయి. సోమ వారం భారీ వర్షాలు పడే సూచనలున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు వాతా వరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘా వృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలు బలంగా ఉన్నాయి. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి.
ఆదివారం అత్యధిక వర్షం కురిసిన ప్రాంతాలు
తట్టి అన్నారం (రంగారెడ్డి) 12.75 సెంటీమీటర్లు
ముషీరాబాద్(హైదరాబాద్) 12.10 సెంటీమీటర్లు
జవహర్‌నగర్(హైదరాబాద్) 11.28 సెంటీమీటర్లు
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్) 10.20 సెంటీమీటర్లు
న్యూ మెట్టుగూడ(హైదరాబాద్) 9.55 సెంటీమీటర్లు
షేక్‌పేట(హైదరాబాద్) 9.43 సెంటీమీటర్లు
అడిక్‌మెట్(హైదరాబాద్) 9.33 సెంటీమీటర్లు
కాప్రా (మేడ్చల్ మల్కాజిగిరి) 9.28 సెంటీమీటర్లు
బోలక్‌పూర్(హైదరాబాద్) 9.15 సెంటీమీటర్లు
చిక్కడపల్లి(హైదరాబాద్) 8.00 సెంటీమీటర్లు
హైదరాబాద్‌ను వణికించిన వాన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES