Monday, September 15, 2025
E-PAPER
Homeజాతీయంఎరువుల కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి

ఎరువుల కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి

- Advertisement -

గుజరాత్‌లో ఘటన
అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో ఎరువుల కర్మాగారంలో ఆదివారం తెల్లవారు జామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు సజీవదహనం కాగా, పలువురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు, అగ్నిమాపక శాఖాధికారుల వివరాలిలా ఉన్నాయి. మెహ్సానా జిల్లాలో సమేత గ్రామ సమీపంలోని యూనిట్‌లో తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి సుమారు గంట సమయం పట్టింది. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో ఆరుగురు కార్మికులున్నారు. నైట్‌ షిప్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణంపై ఇంకా స్పష్టత రాలేదు. మృతులు బీహార్‌, మహారాష్ట్రకు చెందిన మనీశ్‌, పుల్‌చంద్‌లుగా గుర్తించాం. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాం. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -