- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయివేటు కళాశాలలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.
- Advertisement -