- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.
- Advertisement -