అమరుల స్థూపాల వద్ద ఘన నివాళులు
సిపిఐ మండల కార్యదర్శి బైస స్వామి
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే అందరికి స్ఫూర్తిదాయకమని,వారి అమరత్వంతో కమ్యూనిస్టులుగా పేదలకు భూములు పంచామని సిపిఐ మండల కార్యదర్శి బైస స్వామి అన్నారు. సోమవారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని మండలంలోని మునిగలవీడు బైస కట్టమల్లు,బ్రాహ్మణ కొత్త పళ్లి గ్రామంలో కొండపల్లి గోపాల్ రావు,నైనాల గ్రామంలో చిర్ర లింగయ్య,చట్ల యాకయ్య, దండేపల్లి వెంకయ్య ల స్మారక స్తూపాల వద్ద ఎర్ర పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మండల సిపిఐ కార్యదర్శి బైసా స్వామి మండల సహాయ కార్యదర్శి చిర్రా సత్యనారాయణ తో కలిసి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం వెట్టిచాకిరి నైజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వేలాదిమంది అమరులయ్యారని వారు అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితోనే ఎందరో ఉద్యమిస్తున్నామన్నారు అని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల సహాయ కార్యదర్శులు తూటి వెంకట్ రెడ్డి,చిర్ర సత్యనారాయణ, బ్రాహ్మణ కొత్తపల్లి శాఖ కార్యదర్శి వర్రే వెంకన్న, నాయకులు షేక్ సలీం,ఉప్పర బోయిన లక్ష్మణ్,జనార్ధనా చారి,షేక్ దస్తగిరి,గార అనిల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతంగ సాయుధ పోరాటమే స్ఫూర్తిదాయకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES