Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహాలను సకాలంలో పూర్తి చేయాలి 

ఇందిరమ్మ గృహాలను సకాలంలో పూర్తి చేయాలి 

- Advertisement -

ఎండి ఇసాక్ హుస్సేన్.. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజనీర్, ములుగు జిల్లా 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు సకాలంలో లబ్ధిదారులు పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ములుగు జిల్లా సహాయ ఇంజనీర్ ఎండి ఇసాక్ హుస్సేన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో హుస్సేన్ మాట్లాడుతూ ముందుగా మండల ప్రజలకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హౌసింగ్ ఏ ఈ హుస్సేన్ మాట్లాడుతూ    ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఇందిరమ్మ గృహాల పథకాన్ని ప్రజలు  పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఇబ్బందులు సాధక బాధకాలు ఉన్నట్లయితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే పరిష్కారం దిశగా కృషి చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వము జిల్లా కలెక్టర్  ప్రభుత్వ యంత్రాంగము విస్తృతంగా కృషి చేస్తున్నామని అన్నారు.

నిర్మాణంలో కావలసిన ముడి సరుకులు కూడా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఇన్ టైంలో తెచ్చుకునే విధంగా బిల్లులు పాస్ చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో గుడిసె లేని ఇందిరమ్మ గృహాలను చూడాలన్న ప్రభుత్వ ఆశయాలను గౌరవిద్దామని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. నిర్మాణం వేగంగా జరిగే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికార యంత్రంగం అహర్నిశలు  కృషి చేస్తుందని అన్నారు. గ్రామస్తులు నాయకులు పౌరులు లబ్ధిదారులు అందరూ కూడా ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో తమ వంతు సహకారం అందించి నిర్మాణంలో వేగాన్ని పెంచి సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసి సందడిగా పండగ వాతావరణం లో గృహ ప్రవేశాలు చేసుకుందామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -