నవతెలంగాణ-గోవిందరావుపేట: మండల కేంద్రంలోని సామా పూలక్క విగ్రహం వద్ద సోమవారం బహుజన బతుకమ్మ కార్యక్రమా కరపత్రాలను ఆవిషర్కించారు. ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం(ఆర్సిఎస్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం హాజరై మాట్లాడుతూ..ప్రకృతి విధ్వంసం అంటేనే ప్రజలపై యుద్ధం. ప్రకృతికి మరోరూపం స్త్రీ.నేడు ప్రకృతిని సామ్రాజ్యవాదుల లాభంకోసం పాలకులు దారదత్తం చేస్తున్నారు. గుట్టలను, అడవులను ధ్వంసం చేయడం తో ప్రజల జీవనవిధానం చిన్నభిన్నం అయ్యింది. అభయారాణ్యల పేర ఆదివాసులను అడవికి పరాయి వారిని చేస్తున్నారు. మూలవాసులైన ఆదివాసులపై, అడవిలోని పచ్చని ఆకులు నెత్తురు పులుముకుంటున్నాయి. మోడీ మహిళలపై జరుగుతున్న హత్యచారాలకు, లైంగిక వేధింపులకు, హత్య కాండలను నిరసిస్తూ పూల కవాతుతో సెప్టెంబర్ 26 ములుగు జిల్లా పెద్దాపూర్ లోజరుగు బహుజన బతుకమ్మ ను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.
నేడు ప్రకృతి విధ్వంసంకు వ్యతిరేకంగా స్త్రీల రక్షణ కోసం,ఆదివాసుల మనుగడ కోసం,బహుజన బతుకమ్మ ను ఒక ఉద్యమం గా కొనసాగిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగుజిల్లా ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మెన్ ముంజల బిక్షపతిగౌడ్ టి యు ఎఫ్ రాష్ట్ర నాయకులు కొండన్న,అమరులు సామా అంతిరెడ్డి, పూలక్కల కుటుంబ సభ్యులు సామా మోహన్ రెడ్డి, చిన్న పూలక్క, పిఓ డబ్ల్యు (స్త్రీవిముక్తి ), నాయకురాళ్ళు, కవిత, పద్మ ఆదివాసీ నాయకులు, విక్రమ్, శాంత్, రైతుకూలీ సంఘం (RCS )ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మండల యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.