Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద ఎత్తున సీఐటీయులో చేరిన మెప్మా ఆర్పిలు

పెద్ద ఎత్తున సీఐటీయులో చేరిన మెప్మా ఆర్పిలు

- Advertisement -
  • ఆహ్వానించిన జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు..
  • ఆర్ పి లకు కనిసవేతనం అమలు చేయాలి..
  • నవతెలంగాణ – భువనగిరి
  • జిల్లాలో  మున్సిపల్ కేంద్రాలలో పట్టణ పేదల నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్ (ఆర్పి) లు, టిఆర్ఎస్కెవి సంఘానికి రాజీనామా చేసి ఆదివారం సిఐటియు లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం ల సమక్షంలో  పోచంపల్లి,ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల ఆర్పీలు లు రామస్వామి వసంత అన్నపూర్ణ పరమేశ్వరి అండాలు ఆధ్వర్యంలో సిఐటియు లో చేరారు.

ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం లు మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉన్నా కనీస వేతనం ఇస్తామని మభ్య మాటలు చెప్పి సంఘాల్లో చేర్పించుకున్నారన్నారు. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కార్మికులు కనువిప్పు కలిగి తిరిగి మాతృ సంస్థ అయిన సిఐటియులో చేరడం ద్వారా పోరాటాలకు బలం చేకూరుతుందని తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాల ద్వారా హక్కులు, వేతనాలు సాధించుకున్న చరిత్ర ఉన్నదని గుర్తు చేశారు. వి బి కే లుగా ఉన్నప్పుడు పోరాటాలు నిర్వహించిందన్నారు. నేడు ఆర్పి  లను సంఘటితం చేసి వేతనాలు సాధించుకోబోయే ది కూడా సి ఐ టి యు నే అని పునరుద్ఘాటించారు.రేవంత్ రెడ్డి  గత ప్రభుత్వ బాటలో నడవకుండా ఆర్పీలకు కనీస వేతనం ఇవ్వాలని, సీనియారిటీ గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. సంబంధం లేని పనులు చెప్తూ లను పనిఒత్తిడికి గురిచేస్తున్నారని వెంటనే   జాబ్ చాట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇస్తున్న కొద్దిపాటి వేతనం   నేటికి మూడు నెలలు కావస్తున్న ఇవ్వడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని, కనీస గుర్తింపు కార్డ్ లేదని,డ్రెస్ కోడ్ కూడా లేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు మున్సిపాలిటీల నుండి 50 మంది చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ,నాయకులు మంగ వెంకటేష్, పరుషరాములు, సృజన,నవనీత, చంద్రిక,రాజేశ్వరి,సత్యవతి,చింతకింది వాణి,నాగమణి, సమ్మక్క, పద్మజ, సుజాత,ధనలక్ష్మి  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -