నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత హిందీ పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ‘క్వాంటం ఏజ్ బిగిన్స్ ఇట్స్ పొటెన్షియల్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్చిరాం మాట్లాడుతూ.. సైన్స్ పై ఆసక్తి పెంచేందుకు సెమినార్లు ఉపయోగపడతాయని, విద్యార్థులు సైన్స్ కార్యక్రమాలలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని కోరారు. లిటిల్ స్టార్ పాఠశాలకు చెందిన రసికేతన్ (ప్రథమ), లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన సాయి తేజస్వి (ద్వితీయ) న్యూ అరుణోదయ పాఠశాలకు చెందిన ఆర్వి అగ్రవాల్ (తృతీయ) స్థానంలో నిలిచారు. ప్రథమ విజేత రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని జిల్లా సైన్స్ అధికారి ఆరె భాస్కర్ తెలిపారు. న్యాయ నిర్ణయితలుగా తిరుపతి, సంగీత వ్యవహరించారు.
సైన్స్ సెమినార్ లో పాల్గొన్న విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES