Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలి

ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలి

- Advertisement -
  • కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ: ప్రతి ఒక్క విద్యార్థి ఇది నీకు పునాది ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంద‌ని, విద్యార్థులంతా బాగా చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ఆశించారు. ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని నిజాంబాద్ పాలిటెక్నిక్ కళాశాల లో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ఐపీఎస్ విచ్చేసి పూలమాలతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నివాళులర్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను రిటైర్డ్ ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ..మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసినటువంటి సేవలు వినూత్నరీతిలో భారతదేశానికి పేరుప్ర‌తిష్టుల తెచ్చ‌రాని కొనియాడ‌రు. ఆయ‌న సేవ‌లు గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అంద‌జేసింద‌న్నారు. డ్రగ్స్ నిర్మూల‌న‌కు అంద‌రూ కృషి చేయాల‌ని, ట్రాఫిక్ రూల్స్ పాటించి యువ‌త ఆద‌ర్శంగా నిలువాల‌ని కోరారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పి.భారతి ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్ సహా అధ్యక్షుడు కేఎల్వి రమణ, సంయుక్త కార్యదర్శిసత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేష్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేష్ కళాశాల అధ్యాపకులు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -