Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ చేత బహుమతుల ప్రధానం

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ చేత బహుమతుల ప్రధానం

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
యూత్ ఫెస్ట్ 2025 లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా నిజామాబాదు లోని జిల్లా స్థాయి లో గత నెల 25వ తేదీన గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటుచేసిన 5K రెడ్ రన్ కళాశాల బాలుర విభాగంలో గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ తరపున సిద్దార్థ్ మొదటి స్థానం (1000 క్యాష్ ప్రైజ్), బాలాజీ రెండవ స్థానం (500 క్యాష్ ప్రైజ్ లు కైవసం చేసుకున్నారు. అలాగే బాలిక ల విభాగంలో శ్రీవర్ధిని గిరిరాజ్ కాలేజ్ మొదటి స్థానం ఆ(1000 క్యాష్ ప్రైజ్) అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థి అఖిల ద్వితీయ స్థానం (500క్యాష్ ప్రైజ్ )గెలుపొందారు.

అలాగే గత నెల 23వ తేదీన బోర్గం( పి )హై స్కూల్ నందు నిర్వహించిన క్విజ్ పోటీల లో ముబారక్ నగర్ కు చెందిన జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు దీక్షిత మరియు గంగోత్రి మొదటి స్థానం (1000 క్యాష్ ప్రైజ్) అలాగే కుమార్ గల్లికి చెందిన గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థినిలు మహేక్ ఫిర్దోస్ , మరియు లావణ్య రెండవ స్థానం (500 క్యాష్ ప్రైజ్) ను పొందారు. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ టి. వినయ్ కృష్ణ రెడ్డి గారు మరియు అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ,మెడల్స్ మరియు క్యాష్ ప్రైజ్ తో విద్యార్థిని విద్యార్థులను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ ఏ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలినా చొంగుతూ మావి, డిఆర్డిఏ పిడి సాయ గౌడ్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా రాజ శ్రీ , జిల్లా టీబి నియంత్రణ అధికారి. డా. దేవి నాగేశ్వరి , జిల్లా విద్యాధికారి శ్రీ అశోక్ గారు, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు మరియు డిపిఎం సుధాకర్ , టీబిసీవో రవి గౌడ్, నవీన్,పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -