అందరికీ సరిపడా యూరియా వస్తుంది..
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 481 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా పంపిణీ జరిగింది..
జిల్లా వ్యవసాయ అధికారి ఏడిఏ పూర్ణచందర్ రెడ్డి..
నవతెలంగాణ – తిమ్మాజిపేట
రైతులు ఎవరు ఆందోళనకు గురికావద్దని అందరికి సరిపడా యురియా అందుబాటులో తేవడానికి తాము కృషి చేస్తున్నట్లు ఏడిఏ పూర్ణచందర్ రెడ్డి తెలిపారు. సోమవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్న రైతు వేదికలో నాగర్ కర్నూల్ ఏడిఏ పూర్ణచందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్ ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి తో కలిసి మండలంలోని వివిధ గ్రామాల గ్రామాలకు చెందిన ముఖ్య నేతలతో యూరియా సరఫరా నిలువల వివరణ గురించి రైతులలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు ఏడిఏ తెలిపారు. ఈ సమావేశంలో ఏడిఏ మాట్లాడుతూ గత సంవత్సరం 2024లో 783 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని ఈ సంవత్సరం 2025 లో సెప్టెంబర్ 13 వరకు 1264 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.
గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం 481 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా రైతులకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సర వర్షాకాలానికి సంబంధించిన పంటలకు మాత్రమే అవసరమైనంత యూరియా ని మాత్రమే కొనుగోలు చేయాలని యాసంగికి సంబంధించిన యూరియా వచ్చే నెల అక్టోబర్ 1 నుండి రైతులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతులు తొందరపడి యాసంగికి కావాల్సిన యూరియాని ఇప్పటికే కొనుగోలు చేయవద్దని తెలిపారు.
అధికారులు తెలిపిన రోజు మాత్రమే క్యూలో నిల్చని టోకెన్లు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వచ్చి క్యూలో నిల్చోని సమయాన్ని వృధా చేసుకోవద్దని రైతులకు సూచించారు. రైతులకు సరిపడా యురియా అందుబాటులో ఉంచడానికి తాము కృషి చేస్తున్నట్లు రైతులు ఆందోళన గురికా వద్దని సూచించారు. యాసంగి సీజన్ కి కావాల్సిన యూరియా మొత్తాన్ని ప్రభుత్వానికి ముందుగా నివేదిక అందించడం జరిగింది. కాబట్టి యాసంగి పంటలకి కావాల్సినంత యూరియా రైతులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
