Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరిపెల్లి యాదగిరి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి స్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు 6000, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతులకు 4000 పెన్షన్ అందజేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హామీలను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి దివ్యాంగులను, ఒంటరి మహిళలను, వృద్ధులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా నాయకులు బొంకూరు ఉప్పలయ్య, దిండిగాల వెంకన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దండు రామచంద్రు, మండల నాయకులు జలగం నరేష్, శివరాత్రి వెంకటేష్, ఎం నర్సయ్య, బి సత్తయ్య, జి కుమార్, పి సోమన్న, బి ఉప్పలయ్య, ఏ శివ, డి సురేష్, వినోద, ఐలమ్మ, కోరమ్మ, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -