ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు
నవతెలంగాణ – నెల్లికుదురు
జరగబోయే ఎన్నికలు ఎలా జరుగుతాయి అని అంశంపై ఎలక్షన్ నిర్వహణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రవి తెలిపారు. సోమవారం నెల్లికుదురు మోడల్ స్కూల్ నందు సాధారణ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అనే దానిపై అవగాహనను విద్యార్థి లోకానికి అవగాహనపరిచేందుకు సోషల్ స్టడీస్ టీచర్స్ తుమ్మ సతీష్,బోడ దేవేందర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఎన్నికల నియమావళి సరళి విధానం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు అని అన్నారు. ఇందులో భాగంగా స్కూల్ హెడ్ బాయ్ మరియు హెడ్గేల్ని నియమించుకోవడం జరిగినది.
ఇట్టి ఎన్నికలలో మొత్తం 526 మంది విద్యార్థులు పాల్గొని ఓటు వేసి ,హెడ్బాయికి 226 ఓట్లు హెడ్గర్లకి 90 ఓట్లు వేసి వారిని ఎన్నికల ద్వారా నియమించుకోవడం జరిగినది, ఇంటర్మీడియట్ సెకండియర్ సీఈసీ చదువుతున్న ఎరుగు స్టాలిన్ హెడ్ బాయ్ గా, తుప్పతూరి అఖిల హెడ్ గర్ల్ గా, మిగతా విద్యార్థులు పోటీ చేసి క్లాస్ వైస్ హెడ్ బాయ్ అండ్ గర్ల్ గా నియమించబడ్డారు .ఈ ఎన్నికల విధానాన్ని గురించి ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు మాట్లాడుతూ సమాజ నిర్మాణము తరగతి గదిలోనే నిర్మించబడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులు అందరూ పాల్గొని వారి సహాయ సహాయ సహకారాలను అందించి, ఎన్నికల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులందరినీ అదేవిధంగా నియమించబడ్డ విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎలక్షన్స్ నిర్వహణ అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES