Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ నిర్వహణకు అధికారుల సన్నద్ధంగా ఉండాలి..

ఎస్ఐఆర్ నిర్వహణకు అధికారుల సన్నద్ధంగా ఉండాలి..

- Advertisement -

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

2002 ఓటరు జాబితాను ప్రస్తుత జాబితా తో పోల్చాలనీ, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002 పై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి, సీఈఓ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002 పై సోమవారం రోజు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్ల తొలగింపు కు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి  స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్  (ఎస్.ఐ.ఆర్) చేయడం జరుగుతుందని, మన తెలంగాణ రాష్ట్రంలో 2002 లో ఎస్.ఐ.ఆర్ చేయడం జరిగిందని అన్నారు.ఎస్.ఐ.ఆర్ నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు.  బీహార్, మహారాష్ట్ర  వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్.ఐ.ఆర్ చేయడం జరిగిందని అన్నారు. 

ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్  డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని, ప్రతి బి.ఎల్.ఓ దగ్గర  2002 ఎస్.ఐ.ఆర్, 2025 ఎస్.ఎస్.ఆర్ హార్డ్ కాపీలు ఉండాలని, ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసిల్దారులు,  బి.ఎల్.ఓ సూపర్వైజర్లతో రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకోని  

ఎస్.ఐ.ఆర్ చేపట్టేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ,, ఎలక్షన్స్ సెల్ సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -