నవతెలంగాణ – చారకొండ
మండలంలోని రైతు వేదిక వద్ద గ్రామ ప్రత్యేక అధికారి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే సంతను బొడ్రాయి నుండి పీర్ల సవ్వడి వరకు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు. ఇట్టి ఉల్లంఘనకు పాల్పడితే 1000 రూపాయల జరిమానా విధించబడును. గ్రామ అభివృద్ధి నిమిత్తం తై బజారు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్న పందులను, కుక్కలను పట్టిస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా బ్రాహ్మణపల్లి రోడ్డు మెరుగుపరుచుటకు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి గణేష్, ఎస్సై శంషుద్దీన్, గ్రామ సభ సభ్యులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్, కేశమోని శంకరయ్య, వ్యాపారస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కూరగాయల సంత స్థలం మార్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES