Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం బారులు తీరిన రైతులు 

యూరియా కోసం బారులు తీరిన రైతులు 

- Advertisement -

పోలీసు పహారాలో యూరియా టోకెన్ల పంపిణి 
నవతెలంగాణ – పాలకుర్తి

యూరియా గోస రైతులను వెంటాడుతుంది. పంటల అవసరాలకు వర్షం పడడంతో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఉదయం 6 గంటల వరకే యూరియా కేంద్రాల వద్ద రైతులు, మహిళా రైతులు పడి కాపులు గాస్తున్నారు. ఎలాంటి ఆలస్యమైన అంతే సంగతులు. గత రెండు నెలలుగా యూరియా లొల్లి పాలకుర్తి మండలం లో కొనసాగుతూనే ఉంది. సోమవారం మండల కేంద్రంలో గల పాలకుర్తి సొసైటీ తోపాటు, గ్రోమోర్, ఆగ్రోస్ 2, తొర్రూరు సొసైటీలకు 1322 యూరియా బస్తాలు వచ్చాయని మండల వ్యవసాయ అధికారి రేపాల శరత్ చద్ర తెలిపారు. యూరియా కోసం వచ్చిన ప్రతి రైతుకు బస్తా యూరియా అందజేశామని తెలిపారు.

ఆయా కేంద్రాలకు యూరియా వచ్చిందన్న సమాచారంతో వ్యవసాయ శాఖ, పోలీసులు యూరియాకు సరిపడా టోకెన్లను రైతులకు పంపిణీ చేశారు. పోలీసు పహారాలు రైతులకు యూరియాను అందజేశారు. వరికి మొదటి, రెండో విడతలుగా యూరియా అందించాలని ఉద్దేశంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. త్వరలోనే యూరియా కొరత నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని మండల వ్యవసాయ అధికారి శరత్ చంద్ర తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -