Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సకల సౌకర్యాలు

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సకల సౌకర్యాలు

- Advertisement -

– ఫ్రీ బస్సుతో మహిళలకు మేలు
– స్వర్ణ భారతి మండల సమైక్యకు 4 కోట్ల 96 లక్షల  రుణాలు మంజూరు
– పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సకల సౌకర్యాలు అందుతున్నాయని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సూర్య తండా, ఎక్య తండాలకు ఆర్టిసి బస్సు సర్వీసును ప్రారంభించారు. తదుపరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ భవనంలో 72 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు, 34 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం స్వర్ణ భారతి సమాఖ్య మండలికి 4 కోట్ల 96 లక్షల రూపాయల బ్యాంకు రుణాలు అందించడానికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లె పల్లెకు ఆర్టీసీ ప్రగతి రథచక్రాలను తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఫ్రీ బస్సు సౌకర్యంతో మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

పేద ఇంటిలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడేవారని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు విరజముతున్నాయని వివరించారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సీఎం నిధి ఒక సంజీవినిలా ఉపయోగపడుతుందన్నారు. సీఎం నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి సీఎం నిధి చెక్కు అందుతుంది అన్నారు. స్వర్ణ భారతి మండల సమైక్య సంఘాలకు నాలుగు కోట్ల 96 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తుండడం సంతోషకరమన్నారు.

మదర్ యూనిట్స్ పంపిణీ మహిళా శక్తికే సమాజ అభివృద్ధికి పునాది అని, గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. రాయపర్తి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుతా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, ఎంపిఓ ప్రకాష్, ఏపీఎం రవీందర్, టిపిసిసి మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -