- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్ల హామీలను అమలు చేయాలని మండలంలోని అయా గ్రామాలకు చెందిన పలువురు వికలాంగులు, వృద్ధులు,ఒంటరి మహిళలు సోమవారం తహసీల్ ను ముట్టడించారు. అర్హులైన వారందరికీ పెన్షన్లను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్,వీహెచ్ పీఎస్, సీపీహెచ్ పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖరుకు నాయకులు వినతిపత్రమందజేశారు.
- Advertisement -