- Advertisement -
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలో ఇసుక మేట్లతో రైతులకు నష్టం వాటిల్లుతుందని నవతెలంగాణలో వచ్చిన కథనానికి స్పందించిన ఏఈఓ సంగీత సోమవారం మీర్జాపూర్ గ్రామంలోని వరి పంట పొలాలను పరిశీలించారు. మీర్జాపూర్ క్లస్టర్ పరిధిలో 15 ఎకరాలు వరి పంటలో ఇసుకమేట్లు వేసినట్లు ఏఈఓ తెలిపారు. మండలంలోని పోతారం ఎస్ లో 5 ఎకరాలు, మహమ్మదాపూర్ క్లస్టర్ పరిధిలో 15 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు.
- Advertisement -