- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పెనిమిల్ల గ్రామానికి చెందిన ముడిగ నాగేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెల్దండలోని యెన్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన డాక్టర్ మద్ద అనిల్ మానవత్వంతో ముందుకు వచ్చారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లి నాగేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డాక్టర్ అనిల్, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంతేకాకుండా చికిత్స ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు రూ.27,000 ఆర్థిక సాయం అందించారు. గ్రామానికి చెందిన మిత్రుడు దాతృత్వాన్ని చాటుకోవడంతో అంజి, విజయ్ లు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -