Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ, ఎస్సీ, ఎస్టి, జిఏసీ సదస్సు

బీసీ, ఎస్సీ, ఎస్టి, జిఏసీ సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – మక్లూర్
మండల కేంద్రంలోనీ ఎస్ ఆర్ గార్డెన్ పక్షాన హల్ లో  బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జేఏసీ కన్వీనర్ కోటగిరి రామ గౌడ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో మార్చి 31న హైదరాబాద్ కేంద్రంగా జేఏసీ ని ఆవిర్భావం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 5వ తేదీన జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ నిర్వహించడం జరిగింది.

దానికి కొనసాగింపుగా ఈరోజు మాక్లూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తూ 90 శాతం మందికి రాజ్యాధికారమే లక్ష్యంగా రెడ్డి వెలమ కమ్మ రాజ్యాన్ని కూలగొట్టి 90 శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని రాష్ట్రంలో నిర్మిస్తాం దానికి గ్రామ గ్రామాన బీసీ ఎస్సీ ఎస్టీల అవగాహన సమావేశాలు నిర్వహిస్తాం. స్థానిక ఎన్నికల్లో లక్ష్యంగా రాష్ట్రంలో పోరాటం చేసి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోకోన్వీనర్ రాజ్ కుమార్, షేక్ హుస్సేన్, గాండ్ల రామచందర్, రాష్ట్ర డిఎస్పీ కార్యదర్శి సుమన్, జిల్లా డిఎస్పీ అధ్యక్షులు మహిపాల్, జిల్లా నాయకులు రమేష్, మురళి మండల అధ్యక్షులు కిషన్, సాయిలు, ఓడెన్న, సాయన్న, వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -